యోగికి ఉద్ధవ్ ఫోన్ పంచ్... సాధువుల హత్యలపై ఒకరిపై ఒకరు విమర్శలు...?

Reddy P Rajasekhar

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సాధువుల హత్య విషయం గురించి తాజాగా ఫోన్ చేశారు. ఫోన్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది అని చాలామందికి సందేహాలు కలగవచ్చు. కానీ అసలు నిజం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో సాధువుల హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో యోగి ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసి విమర్శలు చేశారు. 
 
సమయం కోసం ఉద్ధవ్ వేచి ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్ లోని బులందర్‌షహర్‌ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్య జరిగింది. కొన్ని రోజుల క్రితం యోగి తనపై విమర్శలు చేయడంతో ఉద్ధవ్ ఫోన్ చేసి ఫోన్ లోనే యోగిపై విమర్శలు చేసినట్టు... ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్ధవ్ యోగితో మాట్లాడిన తరువాత సాధువుల హత్య గురించి యోగితో మాట్లాడానని ప్రకటన చేయడం గమనార్హం. 
 
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లలో ఒకరిపై ఒకరు ఫోన్లలో విమర్శలు చేసుకోవడంతో ఈ ఫోస్ కాల్స్ గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: