సీఎం జగన్ సంచలన నిర్ణయం... మే 6న వారి ఖాతాల్లో 10,000 రూపాయలు...?

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు శుభవార్త చెప్పారు. మే 6వ తేదీన రాష్ట్రంలోని మత్స్యకారుల ఖాతాల్లో 10,000 రూపాయలు జమ కానున్నాయి. లాక్ డౌన్ వల్ల మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు రెండు నెలల పాటు ఉపాధి కోల్పోయారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమవుతుందని తెలిపారు. 
 
గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది మత్స్యకారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ నుంచి ఏపీకి వస్తున్న మత్స్యకారులు ఇవాళ రాష్ట్రానికి చేరుకోనున్నారు. ప్రభుత్వం క్వారంటైన్ పూర్తయిన తరువాత వారిని సొంతూళ్లకు పంపనుంది. ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని వారికి ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టింది. 
 
డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీలను విడుదల చేసి ప్రయోజనం చేకూర్చిన జగన్ రైతులకు త్వరలో రైతు భరోసా నగదును జమ చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: