లాక్ డౌన్ పొడిగింపుకు అసలు కారణం అదే.... భారత్ లో కరోనా ఉధృతి తగ్గలేదన్న మంత్రి కిషన్ రెడ్డి...!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసుల తీవ్రతను బట్టి జోన్లుగా విభజించామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలులో ఉంటుందని అన్నారు. కరోనా నియంత్రణ కోసమే లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారత్ లో కరోనా ఉధృతి తగ్గడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం అన్ని రకాలుగా కరోనా కట్టడి కోసం కృషి చేస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక ఆధారంగానే జోన్ల ఎంపిక జరిగిందని తెలిపారు. రెడ్ జోన్ల ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. 2 కోట్ల 22 లక్షల పీపీఈ కిట్లు తయారు చేయించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రాల అధికారులతో మాట్లాడి లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా నియంత్రణకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపడుతోందని అన్నారు.
వలస కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినా వారు సొంతూళ్లకు వెళ్లాలని కోరారని... అందువల్ల ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వారిని సొంతూళ్లకు పంపిస్తున్నామని పేర్కొన్నారు.