ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం.... ప్రమాణం చేయించిన జే కే మహేశ్వరి...?
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ సురేశ్‌రెడ్డి, కే లలిత కుమారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి అమరావతి కోర్టులో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదులుగా బి కృష్ణమోహన్, కె సురేష్ రెడ్డి, కె లలిత కుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో నూతన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కు చేరింది. నిన్న కేంద్రం ఏపీకి ముగ్గురిని, తెలంగాణకు ఒక్కరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ నిన్న తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులను నియమిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.