వైసీపీ మైరా టీవీ అధినేత బంధువులను కిడ్నాప్ చేయించింది... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ సొంత మీడియా ద్వారా వైసీపీ నేతల అక్రమాలను కట్టుకథలు అల్లి కప్పిపుచ్చుతోందని అన్నారు. మీడియా వైసీపీ వాళ్లు చేసే అక్రమాలను బయటపెడితే వాళ్లు కుతకుతలాడిపోతారని అన్నారు. జగన్ సర్కార్ మీడియా ప్రతినిధులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. 
 
మైరా టీవీ అధినేత ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి బంధువులను పోలీసులతో వైసీపీ కిడ్నాప్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో ఎటువంటి సంబంధం లేని వెంకట కృష్ణ, విద్యార్ధి సవితా వరేణ్య, వారి డ్రైవర్ శ్రీనివాసరావులను కిడ్నాప్ చేయించటాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించకపోతే న్యాయ పోరాటానికి దిగుతామని అన్నారు. 
 
అవసరమైతే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని... ప్రజాహక్కులను హరిస్తామంటే ఊరుకోమని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: