మరో కుట్రకు తెరలేపుతున్న పాక్... ?
భారత్ విషయంలో పాక్ ఎల్లప్పుడూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 1971కు ముందు పాక్ కశ్మీర్ లోకి గిరిజనులను ప్రవేశపెట్టి వారికి రక్షణకోసమంటూ పాక్ సైన్యం ప్రవేశించింది. అలా పాక్ కశ్మీర్ ను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. బంగ్లాదేశ్ ను విడదీయటం వల్ల కూడా పాక్ భారత్ ను ఎల్లప్పుడూ శత్రు దేశంగా చూస్తోంది. అయితే బంగ్లాదేశ్ విడిపోయినా అంతగా అభివృద్ది చెందలేదు.
ఆ తరువాత కాలంలో పాక్ బంగ్లాదేశ్ ద్వారా ఉగ్రవాదులను మన దేశానికి పంపే ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం పాక్ కొత్త కుట్రలకు తెరలేపుతోందని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కశ్మీర్ లో ఉన్న వేర్పాటువాదుల ద్వారా పాక్ కుట్రలకు పాల్పడేది. కొన్ని పార్టీల్లో తమ భావజాలంతో అంగీకరించే వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు పాక్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా భారత్ లో కశ్మీర్ అంతర్భాగం అని తేలిపోవడంతో తమ మాట వినే ప్రజల మధ్యలో ఉగ్రవాదులను పెట్టి సైన్యానికి ఉగ్రవాదులు అక్కడ ఉన్నారని సమాచారమిచ్చి వారిని ప్రజలచే అటాక్ చేయిస్తోందని తెలుస్తోంది. పాక్ ఈ తరహా ఎత్తుగడలు వేస్తున్నట్టు వార్తలు వస్తూ ఉండటంతో భారత్ ఈ కుట్రలను ఎలా తిప్పికొడుతుందో చూడాలి.