బ్రేకింగ్‌: ర‌ష్యా, బ్రెజిల్‌, భార‌త్లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌... ఆ దేశంలో క‌రోనా జీరో...!

VUYYURU SUBHASH

ప్రపంచదేశాలన్నీటిని కరోనా మహమ్మరి వణికిస్తోంది. ఓ వైపు ప్ర‌పంచంలో వ్య‌వ‌స్థలు అన్ని కుప్ప కూల‌డంతో క‌రోనా ధాటికి ఆర్థికంగా న‌ష్ట‌పోయినా దేశాలు అన్ని లాక్ డౌన్ ఎత్తేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌ళ్లీ క‌రోనా కోర‌లు చాస్తోంది. సోమ‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 77, 515  కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 36,41204కి చేరింది. సోమవారం ఒక్కరోజే 3,802 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 2,51,947కి చేరింది. 

 

క‌రోనా త‌గ్గుతోంది అనుకుంటోన్న స‌మ‌యంలోనే ఇప్పుడు మ‌ళ్లీ విజృంభించ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 50 వేల మందికి పైగా ప్ర‌జలు క‌రోనాతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇక అగ్ర రాజ్య‌మైన అమెరికాలో క‌రోనా విల‌య తాండ‌వం ఆగ‌ట్లేదు. సోమ‌వారం ఒక్క రోజే ఏకంగా 23 వేల‌కు పైగా కేసులు వ‌చ్చాయి.  అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 12 ల‌క్ష‌లు దాటేసింది. సోమవారం 1112 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 69,709కి చేరింది.

 

ఇక రష్యాలో సోమ‌వారం ఒక్క రోజే 1,581 కేసులు రాగా.... బ్రెజిల్ 6697, బ్రిటన్ 3985లో కేసులు విపరీతంగా పెరిగాయి. న్యూజిలాండ్ లో కరోనా వైరస్ పూర్తిగా కంట్రోల్ అయింది. అక్కడ 1337 కేసులు నమోదు కాగా.., 20 మంది మృత్యువాత పడ్డారు. 1337 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కరోనాను పూర్తిగా కంట్రోల్ చేయగలిగింది. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ కేసుల సంఖ్య 42 వేలు దాట‌గా.. మ‌ర‌ణాలు 1400కు ద‌గ్గ‌ర్లో ఉన్నాయి. అత్య‌ధికంగా మహారాష్ట్ర లో 12,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 548 మంది మృతి చెందారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: