ఆ వెబ్ సైట్ కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న టాలీవుడ్... విజయ్ కు మద్దతు పలికిన రాజశేఖర్..?

Reddy P Rajasekhar

చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లోని మూడు నాలుగు వెబ్ సైట్లు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయని.... కొన్ని వెబ్ సైట్లు కావాలనే తప్పుడు రాతలు రాస్తున్నాయని.... ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కక్ష్య పెట్టుకుని తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశాడు. విజయ్ వ్యాఖ్యలకు మద్ధతుగా టాలీవుడ్ ఇండస్ట్రీ కదులుతోంది. చిరంజీవి, మహేష్ బాబు, రానా దగ్గుబాటి, హరీష్ శంకర్ విజయ్ కు మద్దతు పలికారు. 
 
యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ విజయ్ కు మద్దతు పలుకుతూ ట్వీట్ చేశాడు. రాజశేఖర్ తన ట్వీట్లో చాలా వెబ్ సైట్లు, న్యూస్ ఛానెళ్లు హానెస్ట్ గా ఉన్నాయని... కొన్ని వెబ్ సైట్లు, న్యూస్ ఛానెళ్లు మాత్రం ఫేక్ వార్తలను, ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఫేక్ వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాను, వెబ్ సైట్లను కోరుతున్నానని అన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఆ వెబ్ సైట్ కు వ్యతిరేకంగా టాలీవుడ్ అంతా ఒక్కటవుతూ విజయ్ కు మద్దతు పలుకుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: