జనాలకు మద్యం అలవాటు చేసింది చంద్రబాబే... అంబటి సంచలన వ్యాఖ్యలు...?
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ మద్యపాన నిషేధమే లక్ష్యంగా జగన్ సర్కార్ పని చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు గతంలో సీనియర్ ఎన్టీయార్ మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి.... జనాలకు మద్యపానాన్ని విచ్చలవిడిగా అలవాటు చేశారని విమర్శలు చేశారు.
చంద్రబాబు ప్రజలు తనను మరిచిపోకూడదనే వారానికి మూడు నాలుగుసార్లు స్కైప్, జూమ్ యాప్స్ ద్వారా కనిపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని... చంద్రబాబు మాట్లాడే మాటల్లో విషయం లేదని అన్నారు. చంద్రబాబు ఏపీలో అమ్మకాలు ప్రారంభించామని బాధ పడుతున్నారో... ధరలు పెంచామని బాధ పడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. మరి అంబటి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.