ఏపీలో షాక్ కొట్టించే రేట్లు ఉండాలనే మద్యం ధరల పెంపు... సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మద్యపాన నియంత్రణ కోసమే కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నియంత్రణలో భాగంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేశామని అన్నారు. అందులో భాగంగానే 75 శాతం రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఏపీలో షాక్ కొట్టించే రేట్లు ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
 
 
వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత 43,000 బెల్టు షాపులను రద్దు చేశామని లాభాపేక్ష లేకపోతే మాత్రమే గ్రామాల్లో బెల్టు షాపులు శాశ్వతంగా చేయగలమని అన్నారు. అందువల్లే రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈరోజు సీఎం జగన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ వ్యాఖ్యలు చేశారు; రాష్ట్రంలో కరోనా కట్టడి గురించి, లాక్ డౌన్ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: