తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా... 11 పాజిటివ్ కేసులు నమోదు..?
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ మానవ ప్రపంచాన్ని కరోనా అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 1096 మందికి కరోనా సోకిందని తెలిపారు. రాష్ట్రంలో 628 మంది డిశ్చార్జ్ అయ్యారని... ఈరోజు 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు.రాష్ట్రంలో 439 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణ సర్కార్ మొదటి నుండి కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తోందని అన్నారు.
దేశంలో కరీంనగర్ మొదటి కంటోన్మెంట్ జోన్ అని పేర్కొన్నారు. మంత్రి రాజేందర్, ఇతర నాయకులు కరీంనగర్ లో కరోనా కట్టడి కోసం కష్టపడ్డారని అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. మరణాల రేటు విషయంలో తెలంగాణలో 2.64గా ఉందని... దేశం సగటుతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. రికవరీ రేటులో 57.04 గా ఉందని దేశ సగటు కంటే తెలంగాణలో ఎక్కువ రికవరీ రేటు ఉందని అన్నారు.