ఔరంగాబాద్ రైలు ప్రమాదం విచారకరం: చంద్రబాబు

Lavanya

ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్తగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.   

 

ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది వలస కూలీలు మృతి చెందారు. చనిపోయిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వలస కూలీలు మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ వెళ్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

 

వారంతా రైల్వే ట్రాక్ పక్కనే కాలి నడకగా స్వస్థలాలకు వెళుతున్నట్లుగా తెలిసింది. మార్గ మధ్యలో పట్టాలపై నిద్రించినట్లుగా సమాచారం. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కలచివేశాయి. 

 

Deeply pained by the train accident in #Aurangabad which has claimed many lives. My heartfelt condolences to the grieving families. I also pray for the speedy recovery of those injured.

— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) May 8, 2020

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: