విశ్వ కవి ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మోదీ.... ఆయన కృషిని అభినందిస్తూ ట్వీట్...?
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత స్వాతంత్రోద్యమం కోసం ఠాగూర్ ఎంతో కృషి చేశారని అన్నారు. అనేక రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన కృషిని ప్రశంసించారు. ఠాగూర్ ఆలోచన మరియు భావ వ్యక్తీకరణ ఉన్నతంగా ఉంటుందంటూ ప్రశంసించారు. ఆయన కృషితో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని చెప్పారు.
గురుదేవ్ గా ప్రసిద్ది చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రపంచ ప్రఖ్యాత కవి, సాహిత్యవేత్త మరియు తత్వవేత్త. సాహిత్యంలో నోబెల్ పొందిన ఏకైక భారతీయ సాహిత్యవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ కోల్‌కతాలో 1861 మే 7 జన్మించారు. 8 ఏళ్ల వయస్సులోనే ఠాగూర్ ఒక ఫ్రెంచి కవితకు అనువాదం చేశారు. ఠాగూర్ రచనల్లో గీతాంజలి గొప్పది. గీతాంజలి రచనకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న రవీంద్రుడు రాసిన జనగణమణను జాతీయ గీతంగా ప్రకటించారు.
Tributes to Gurudev Tagore on his Jayanti. Gifted in several fields, he made a strong contribution towards India’s freedom movement. His clarity of thought and expression were always outstanding. pic.twitter.com/cMeVAarZ5h — narendra modi (@narendramodi) May 8, 2020