కరోనాపై యుద్దం: 24 గంటల్లో 3390 కొత్త కేసులు : లవ్ అగర్వాల్
దేశంలో గత ఫిబ్రవరి నుంచి కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రతిరోజూ పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ప్రబలి పోతున్నాయి. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 3390 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1273 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 29.36కు చేరింది. దేశంలో ఇప్పటివరకూ 56342 కేసులు నమోదయ్యాయి.
16540 మంది రికవర్ అయ్యారు. 1886 మంది చనిపోయారని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలున్న వారికి ఈ కేంద్రాల్లో చికిత్స అందించాలని నిర్ణయించినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. రైల్వే శాఖ సహకారంతో ఇప్పటివరకూ 5231 రైల్వే కోచ్‌లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చామని లవ్ అగర్వాల్ చెప్పారు. 250 స్టేషన్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
#Live | The COVID-19 recovery rate in India stands at 29.36%: Health Ministry briefs media.https://t.co/LnIpcXJspj pic.twitter.com/6NTHQpJ7QF — TIMES NOW (@TimesNow) May 8, 2020