రామాయణ మహాభారతాలు టీవీల్లో చూస్తే కళ్లు పోతాయా...?
కాలం మారుతోంది. జనం ఆలోచనల్లో సైతం వేగంగా మార్పు వస్తోంది. గతంలో రామాయణ, మహాభారతాలను టీవీల్లో వీక్షించే వాళ్లపై టీవీ ఛానెళ్లు సనాతన సాంప్రదాయం వైపు తీసుకెళ్లిపోతున్నారని.... మనువాదం వైపు తీసుకెళ్లిపోతున్నాయని విమర్శలు వినిపించాయి. ఆ విమర్శల వల్ల మనం రామాయణ, మహాభారతాలపై ఆసక్తి చూపించటం తగ్గించేశాం. సంసృతి సాంప్రదాయాల గురించి తక్కువగా తెలుసుకుంటే మంచిదని... ఎక్కువగా తెలుసుకుంటే మంచిదని గతంలో ప్రజలు అభిప్రాయపడ్డారు.
అయితే నేటి ప్రజల ఆలోచన తీరులో మారుతోంది. మన సంస్కృతి, సాంప్రదాయాలలోని గొప్పదనాన్ని నేడు దూరదర్శన్ లో ప్రసారం అవుతున్న రామాయణ, మహాభారతాన్ని చూడటం ద్వారా ప్రైవేట్ ఛానెళ్లలో అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. ప్రజల్లో ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. అయితే కొందరు దూరదర్శన్ లో ప్రసారమయ్యే కంటెంట్ పాతకాలం క్వాలిటీతో తీశారని... వాటిని చూస్తే కళ్లు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారు.
టీవీలో పాతకాలం వీడియోలు చూస్తేనే కళ్లు పోతే.. 24 గంటలు సెల్ ఫోన్ చూసే వాళ్ల కళ్లు కనిపిస్తాయా....? ఎక్కువ సమయం టీవీ చూస్తే కంటికి ప్రమాదమని చెప్పవచ్చు కానీ రామాయణ, మహాభారతాలు చూస్తే కళ్లు పోతాయని కొందరు చేస్తున్న దుష్ప్రచారంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాఅరు.