నేను ప్లాస్మా దానం చేశా‌.. మీరూ చేయండంటున్న బాలీవుడ్ న‌టి

Kaumudhi

కరోనా వైర‌స్‌కు ప్ర‌స్తుతం వ్యాక్సిన్ లేదు. ప్ర‌త్యామ్నాయంగా క‌రోనా పేషెంట్ల‌కు ప్లాస్మా థెర‌పీ అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో భార‌త్‌లో ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల‌లో ప్లాస్మా థెర‌పీ చేస్తున్నారు. అయితే.. క‌రోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేక‌రించి చికిత్స చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా.. క‌రోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత క‌రీం మొరానీ కూతురు న‌టి జోయా మొరాని ప్లాస్మా దానం చేసింది. ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రి సిబ్బందితో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్లాస్మా దానం చేయ‌డం సూపర్ కూల్‌గా ఉంద‌ని ఆమె ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. *క‌రోనా చికిత్స స‌మ‌యంలో వైద్యులు మంచి వైద్యం అందించారు. స్టాండ్ బై ఎప్పుడు ఒక వైద్యుడు ఉండేవారు.

 

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ప‌రికరాల‌ని వాడేవారు. కోవిడ్ -19 నుండి కోలుకున్న వారందరూ ఇతర రోగులకు కోలుకోవడానికి ప్లాస్మాని దానం చేయాలి* అని జోయా పిలుపునిచ్చారు . ప్లాస్మా దానం చేసినందుకు స‌ర్టిఫికెట్‌తో పాటు రూ.500 రూపాయ‌లు కూడా ఇచ్చిన‌ట్టు ఆమె పేర్కొంది. కాగా, శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే యాంటీ బాడీస్ ప్లాస్మాలో ఉంటాయి. కరోనా నుంచి కోలుకొన్నవారి ప్లాస్మాలో వైరస్‌ను చంపే యాంటీ బాడీలు ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్‌ కణాలను తెల్లరక్తకణాలు గుర్తించి నాశనం చేస్తాయి. ఒక దాత నుంచి సేకరించిన ప్లాస్మాతో నలుగురికి చికిత్స అందించవచ్చు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Donated my blood today for the #plasmatherapy trials at #nairhospital .. it was fascinating !!! Always a {{RelevantDataTitle}}