పిల్లివారు అలిగారు.. కుక్కగారు ప్రాదేయపడ్డారు.. వీడియో వైరల్!
సాధారణంగా ప్రపంచంలో కొన్ని జంతువులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అవి ఎదురు పడితే ఎంత వైరం అంటే ఒకదానినొకటి చంపుకునేంత. కోతీ-కుక్క, పిల్లీ-ఎలుక, కోతి-పిల్లి ఇలా చాలా వరకు కుక్కలు ఏ జంతువైనా వైరంగా చూస్తుంటాయి. ముఖ్యంగా పిల్లి ఎదురు పడితే దాన్ని తరిమేస్తుంది. అలాంటిది కొన్ని చోట్ల మాత్రం వీటి అన్యోన్యత చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మద్య ఓ పిల్లీ, పాము ఆడుకోవడం చూశాం.. తాజాగా ఓ పిల్లి అలకబూనితే కుక్క బ్రతిలాడి దాన్ని తమ ముందు వరసలో నిలబెట్టడం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. మూడు కుక్కలకు మంచి డ్రెస్ వేసి ఫోటో, వీడియో షూట్ చేస్తున్నారు.
వీటితో పాటు ఓ పిల్లి కూడా ఉంది.. మరి దానికి మంచి డ్రెస్ వేయలేదని అలిగిందో ఏమో కానీ కుక్కలు వరుసగా ఉంటే తానుమాత్రం సపరేట్ గా నిలబడింది. దాంతో అందులో ఓ కుక్క పిల్లిని బ్రతిలాడి నోట్లో కరుచుకొని మరీ కెమెరా ముందుకు తీసుకు వచ్చి తమ ముందు లైన్లోనిలబెట్టింది. అయినా పిల్లి మాత్రం బుంగ మూతి పెట్టుకొని అలాగే సైడ్ తిరిగి ఉంది. ఏది ఏమైనా కుక్కలు మాత్రం షర్ట్, మెడకు టైలు అన్ని ధరించి టిప్‌టాప్‌గా రెడీ అయ్యాయి. మనుషులు కూడా ఇంత బాగా తయారవ్వరేమో అన్నట్లున్నాయి. ఈ వీడియోను ట్విటర్లో ఫోస్ట్ చేశారు. వీటి ఫొటోషూట్‌ను మీరు కూడా చేసేయండి.
"Alright, Mr. DeMille, We're ready for a close-up now" 😍👍 pic.twitter.com/8oXHiJw54s — Madeyousmile (@Thund3rB0lt) May 7, 2020