ఫేస్ బుక్ పర్యవేక్షక కమిటీపై డిబేట్.... కమిటీతో సోషల్ మీడియా గాడిన పడేనా..?
మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని ఫేస్ బుక్ తాజాగా నూతన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివాదాస్పద పోస్టులకు చెక్ పెట్టడంతో పాటు కంటెంట్ ఆధునీకరణ కోసం కృషి చేయనుంది. ఫేస్ బుక్ పర్యవేక్షణ కమిటీ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 27 దేశాలకు చెందిన 20 మంది సభ్యులతో ఈ బోర్డు ఏర్పాటైంది. డెన్మార్క్ మాజీ ప్రధాని హీలీ స్మిత్, నోబెల్ గ్రహీత తవకల్ కర్మన్, నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూర్ వీసీ సుధీర్ కృష్ణస్వామి లాంటి ప్రముఖులు ఈ బోర్డులో ఉన్నారు.
ఈ బోర్డుకు జుకర్ బర్గ్ నిర్ణయాలను సైతం వ్యతిరేకించే అధికారం ఉండటం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్ బుక్ కంటెంట్ ఆధునీకరణ వ్యూహం గురించి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిపుణులు మాత్రం ఈ పర్యవేక్షణ కమిటీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. కమిటీ పూర్తి కాలం పని చేసినా హై ప్రొఫైల్ కేసుల పర్యవేక్షణ మాత్రమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.