ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా... ఆ రెండు జిల్లాల్లోనే కొత్త కేసులు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఈరోజు కేవలం 33 కేసులు నమోదయ్యాయి. ఈ 33 కేసులలో చిత్తూరులో 10, నెల్లూరులో 9, తూర్పు గోదావరిలో ఒక కేసు నమోదు కాగా ఈ కేసులన్నీ తమిళనాడు నుండి వచ్చిన కేసులు కావడం గమనార్హం. తమిళనాడు నుండి రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అయింది. ఈ కేసులు కాకుండా రాష్ట్రంలో రెండు జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో 9 కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కరోనా తగ్గుముఖం పడుతోంది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2051కు చేరింది. రాష్ట్రంలో 1056 మంది డిశ్చార్జ్ కాగా 949 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.