కేటీఆర్ కు తీవ్ర జలుబు అంటూ వార్తలు వైరల్... స్పందించిన మంత్రి...?

Reddy P Rajasekhar

నిన్నటి నుంచి మంత్రి కేటీఆర్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్ నిన్న ఒక కార్యక్రమంలో తుమ్ములు, జలుబుతో ఇబ్బంది పడ్డారు. ఐదారు సార్లు తుమ్ముతూ కనిపించిన కేటీఆర్ డస్ట్ ఎలర్జీ ఎక్కువ కావడంతో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం సోషల్ మీడియా, వెబ్ మీడియాలో కేటీఆర్ ఆరోగ్యం గురించి వదంతులు వచ్చాయి. 
 
దీంతో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని... తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. తాను బాగానే ఉన్నానని అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ వల్ల నిన్న ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: