20 లక్షల కోట్లు : నిర్మల 9 పాయింట్ ఫార్ములా ఇదే..!
నిన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్ష్లల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించిన నిర్మలా సీతారామన్ ఈరోజు వ్యవసాయ రంగానికి, ఇతర రంగాలకు సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మొత్తం 9 రంగాలకు సంబంధించిన ఉద్ధీపన చర్యలను ప్రకటించనున్నట్టు తెలిపారు. వలస కార్మికులు, వీధి వ్యాపారుల గురించి కీలక ప్రకటనలు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు.
పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం 9 పాయింట్ ఫార్ములా కేంద్రం దగ్గర ఉందని అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇప్పటికే ఇచ్చామని అన్నారు. రైతులకు లాక్ డౌన్ ప్రకటించకపోయినా కేంద్రం వారిని ఆదుకోవాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈరోజు వలస కూలీలు, చిన్న రైతులు, స్ట్రీట్ వెండర్స్, ముద్ర యోజన, హౌసింగ్, గిరిజనులకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్యాకేజీ వెల్లడించారు.