టీడీపీ ‘జూమ్’ పార్టీలా తయారైంది.. : మంత్రి బొత్స సత్యనారాయణ

Edari Rama Krishna

దేశం మొత్తం కరోనాలో అల్లకల్లోలం అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కరోనా రోజు రోజు తన ప్రతాపాన్ని చూపిస్తుంది.  ఈ సమయంలో సమన్వయంతో పని చేయాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మద్య రోజు వార్ నడుస్తుంది.  ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. ఇక అధికార పార్టీ ఏం చేసినా కావాలని లేని పోని నిందలు మోపుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని.. అసలు టీడీపీ ప్రతిపక్ష పార్టీలా ఏమాత్రం వ్యవహరించడం లేదని  జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు అయితే చేస్తారని, టీడీపీ.. ‘జూమ్ పార్టీ’గా తయారైందని సెటైర్లు విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.  విశాఖపట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ ఉన్న ప్రాంతాల్లో వారిని, ప్రమాదాలు సంభవించిన ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించేందుకు టీడీపీ నాయకులు వెళ్లరని, వారికి సాయపడరని విమర్శించారు.

 

కానీ వెలెత్తి చూపించడంలో మాత్రం మహా మొనగాళ్లని అన్నారు.  సీఎం జగన్ ఏం మాట్లాడినా దానిని తప్పుగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన టీడీపీలో కనిపిస్తోందని విమర్శించారు. విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై సీఎం చొరవతో 5 రోజుల్లోనే అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని, అదే కనుక, టీడీపీ అయితే ఈ సమస్య సద్దుమణిగేందుకు 50 రోజులు పట్టేదని ఎద్దేవా చేశారు.  మీరు చేస్తున్న ప్రతి ఒక్కటీ ప్రజలు గమనిస్తున్నారని.. మొన్నటి ఎన్నికల్లో మీకు బుద్ది ఎలా చెప్పారో గమనించి టీడీపీ నేతలు మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: