విశాఖ ప‌రిహారం దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డు: జ‌గ‌న్‌

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులందరికీ ఆర్థిక సహాయం అందిందని చెప్పారు. దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించామని సీఎం తెలిపారు. విశాఖ ప‌రిహారం దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డు అని అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజి బాధితుల కోసం 37 కోట్ల 17 లక్షల 80 వేలు విడుదల చేశామని అన్నారు. వెంటిలేటర్లపై ఉన్నవారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. 
 
వాస్తవాలను తెలుసుకునేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ వేశామని న్నారు. సీఎం జగన్ విశాఖ గ్యాస్ లీకేజ్ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆస్పత్రుల్లో రెండు రోజుల కంటే ఎక్కువ చికిత్స పొందిన వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించారని... యాజమాన్యం తప్పు ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: