బ్రేకింగ్‌: హైద‌రాబాద్‌లో వీటికి నో ప‌ర్మిష‌న్

Reddy P Rajasekhar

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటన చేశారు. కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగిలిన్ అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమవుతాయని అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల విద్యాసంస్థలు బంద్ చేయాలని చెప్పారు. హైదరాబాద్ లో సిటీ బస్సులకు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు. 
 
హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దుకాణాలు తెరవవచ్చని చెప్పారు. హైదరాబాద్ లో సరి బేసి పద్ధతిలో షాపులు తెరవవచ్చని... ఆటో ట్యాక్సీలకు నగరంలో అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. అన్ని మతాల ప్రార్థనా మందిరాలు బంద్ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు మనం కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని కేసీఆర్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: