మీ సమస్యలు కేసీఆర్ కి చెప్తా... తలసాని హామీ...!

సినీ పరిశ్రమ కష్టాలను సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తా అని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సినిమా రంగం కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ... మాక్‌ షూటింగ్‌ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని, తెలంగాణ ప్రభుత్వం తెలుగుచలనల చ్రిత పరిశ్రమ పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

 

పరిశ్రమలోని 14వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోస్ట్‌ ప్రొడెక్షన్‌ చేసుకునేందుకు అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశామని మాస్క్ లు ధరించి కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన సూచనలు చేసారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నటులు నిర్మాతలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: