విమాన ప్రయాణికులకు భారీ షాక్... భారీగా పెరగనున్న టికెట్ల ధరలు...?
కేంద్రం తాజాగా ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం విమాన ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. తాజాగా కేంద్రం మెట్రో నగరాల మధ్య మూడింట ఒక శాతం సర్వీసులు, నాన్ మెట్రో నగరాల మధ్య పూర్తి స్థాయిలో సర్వీసులు నడుపుతామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. విమాన టికెట్ ధరల విషయంలో కొత్త టికెట్ విధానాన్ని అమలు చేస్తామని అన్నారు.
టికెట్ ధరలు ఏడు కేటగిరీలుగా ఉండనున్నాయని మంత్రి మీడియాకు తెలిపారు. రాబోయే మూడు నెలల పాటు ఈ కొత్త విధానం అమలులో ఉంటుందని అన్నారు. టికెట్ ధర కనిష్ఠంగా 3,500 రూపాయలు, గరిష్టంగా 10,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. టికెట్ రేట్ల గురించి మూడు నెలల తర్వాత సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.