బిగ్ బాస్ 4 లో సరికొత్త పేర్లు.. నిజమా అబద్దమా?

Edari Rama Krishna

తెలుగు బుల్లితెరపై ఇప్పుడు సరికొత్త హంగులతో బిగ్ బాస్ 4 సీజన్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి కూడా కింగ్ నాగార్జున హూస్ట్ గా రాబోతున్నారని.. వాస్తవానికి మహేష్ బాబు ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చినా.. బిగ్ బాస్ దృష్టి నాగ్ పైనే ఉన్నట్టు సమాచారం. టీవీ రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' షోకు వున్న క్రేజే వేరు..
ఆ కాన్సెప్ట్, ఆ టాస్కులు, పోటీలు, కోపాలు.. తాపాలు, గ్రూపులు ఇలా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దానికి తోడు ఓ పెద్ద ఫిలిం స్టార్ దానికి హోస్టుగా వుండడం మరింత ఆకర్షణీయం అవుతుంది.  తెలుగు లో ఇప్పటికి ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకోగా, త్వరలో నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. 

 

ఇక ఇందులో పాల్గొనే పార్టిసిపేంట్స్ ఎవరన్న దానిపై గత కొన్ని రోజులుగా బోలెడు పేర్లు వినవస్తున్నాయి. తాజాగా మరికొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈసారి బిగ్ బాస్ లో పెద్ద సెలబ్రెటీలే రాబోతున్నారన వార్తలు వస్తున్నాయి. గతంలో పలు సినిమాలలో నటించి, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న తరుణ్ ఇందులో ఒక పార్టిసిపేంట్ గా ప్రత్యేక ఆకర్షణ కానున్నాడని అంటున్నారు. అలాగే, జానపద గీతాల గానంతో పేరుతెచ్చుకున్న మంగ్లీ కూడా పాల్గొంటుందని సమాచారం.  అంతే కాదు.. టీవీ యాంకర్లు వర్షిణి, జాహ్నవి తదితరులతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎవరిని ఎంపిక చేశారనేది వెల్లడవుతుంది. అయితే బిగ్ బాస్ 4 సీజన్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: