ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కిన జనం.... ఆవు చనిపోయిందని వందల సంఖ్యలో...?

Reddy P Rajasekhar

కేంద్రం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వివాహాలకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కారు. ఆవు చనిపోయిందని వందల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అలీఘ‌ర్‌లో లోని మెమ్దీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దినేశ్ చంద్ర శ‌ర్మ అనే వ్య‌క్తికి చెందిన ఆవు రెండు రోజుల క్రితం మరణించింది. 
 
ఆవుకు అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించాలని 150 - 200 మంది జ‌నాలు ఊరేగింపుగా మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా రోడ్లపైకి వచ్చారు. ఈ విషయంపోలీసులకు తెలియడంతో 150 మందిపై ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆవు యజమాని మాత్రం స్వ‌చ్ఛందంగా ఆవు అంత్యక్రియలలో పాల్గొనడానికి వచ్చినవారిని తాను ఎలా అడ్డుకోగలనని ప్రశ్నించడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: