స్వయంగా ఇంటిని క్లీన్ చేసిన ఎమ్మెల్యే.. ఫోటో వైరల్..?
Continued cleanliness drive in the third week at residence as per Hon’ble Minister Sri @KTRTRS Garu call to eradicate seasonal diseases. #EverySunday10minutesat10am #CleanDriveOnSundays #10minutesat10am #3rdWeek pic.twitter.com/Ji2tO7UYvi — N Diwakar Rao MLA (@NDiwakarRao) May 24, 2020
ప్రస్తుతం కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు ఎంతో మంది రాజకీయ ప్రముఖులు సైతం కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత తో పాటు సామాజిక దూరం... పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరం అంటూ సూచిస్తున్నారు. అయితే తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు నిర్మూలించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయన నివాసంలో మూడవ వారంలో శుభ్రత డ్రైవ్ కొనసాగింది అంటూ ఒక పోస్టు పెట్టారు.
ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. స్వయంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాఫ్ చేత పట్టుకొని తమ ఇంటిలోని పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. కేటీఆర్ సార్ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ పరిశుభ్రతను పాటించే విధంగా తాము కూడా పాటిస్తూ అందరికీ తెలియపరుస్తున్నాము అంటూ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.