వార్నర్ పర్ఫార్మెన్స్కి కోహ్లీ ఫిదా
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య టిక్‌టాక్ వీడియోలతో అదరగొడుతున్నారు. లాక్డౌన్ సమయంలో టిక్‌టాక్ వేదికగా నెటిజన్స్‌కి వినోదాన్ని పంచుతున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలకి సంబంధించిన పాటలకి స్టెప్పులు వేస్తూ, పవర్ ఫుల్ డైలాగ్స్‌కి యాక్షన్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా.. అక్షయ్ కుమార్ నటించిన హౌజ్‌ఫుల్ 4 చిత్రంలోని బాలా.. సైతాన్ కా సాలా అనే సాంగ్‌కి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోకి భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నవ్వుతున్న ఎమోజీలని కామెంట్ రూపంలో పోస్ట్ చేశాడు.
ఈ సందర్భంలో వార్నర్ .. అనుష్కతో కలిసి డ్యూయట్ చేయమని కోరాడు. లాక్డౌన్ వలన క్రికెట్‌కి దూరంగా ఉంటున్న క్రికెటర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులని ఏదో రకంగా అలరిస్తూ వస్తున్నారు. అంతకుముందు వార్నర్ బాహుబలి గెటప్‌లో, బుట్టబొమ్మ సాంగ్‌కి స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.
auto 12px; width: 50px;">View this post on InstagramI think I’ve got you covered @akshaykumar #bala #fun #friday #challenge 😂😂😂 {{RelevantDataTitle}}