మంత్రి తలసాని సంచలన నిర్ణయం... 14,000 కుటుంబాలకు సాయం...?
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనియాస్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14,000 సినీ, టీవీ కుటుంబాలను ఆదుకోనున్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో సినిమా, టీవీ రంగాలపై ఆధారపడిన వేల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వీరి ఆకలి తీచేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా విరాళాలు సేకరించి సినిమా రంగంపై ఆధారపడిన వారికి నిత్యావసర సరుకులను, ఇతర వస్తువులను పంపిణీ చేసింది.
తాజాగా మంత్రి తలసానీ సినీ, టీవీ కార్మికులను ఆదుకోవడం కోసం ముందుకొచ్చారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. మంత్రి తలసాని మీడియాతో 14,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందేవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.