చిన్నారులకు మాస్కులు ప్రమాదకరం... తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు...?

Reddy P Rajasekhar

కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తున్నారు. అయితే చిన్నారులు మాస్కులు ధరించడం వల్ల ప్రమాదం ఉందని జపాన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు మాస్కు ధరిస్తే శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. జపాన్ పిడియాట్రిక్ అసోసియేషన్ మాస్కులు ధరించే చిన్నపిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. 
 
చిన్నారుల్లో శ్వాస మార్గం ఇరుకుగా ఉండటం వల్ల మాస్కు ధరించిన సమయంలో గాలి పీల్చితే గుండెపై భారం పెరుగుతుందని... రెండేళ్ల లోపు పిల్లలకు మాస్కులకు వినియోగించవద్దని సూచించింది. చిన్నారులు కరోనా భారీన పడి ప్రమాదకరంగా మారిన ఘటనలు తక్కువేనని పేర్కొంది. చాలా మంది పిల్లలకు వారి కుటుంబ సభ్యుల నుంచే కరోనా సంక్రమిస్తుందని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: