ఎన్టీఆర్‌‌కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ..!

Edari Rama Krishna

దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు లాక్ డౌన్ కారణంగా నిరాడంబరంగా జరుగుతున్న వేళ, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొద్దిసేపటి క్రితం నివాళులు అర్పించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉండటం వల్ల సామాజిక దూరం, మాస్క్ తప్పనిసరి అయ్యింది.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ నియమాలు పాటిస్తూ అభిమానులు వచ్చారు. ఇక  నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరా, ఎన్టీఆర్ తనయులు  రామకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

మరోవైపు ప్రతి యేడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ తాజాగా నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటి వద్దే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

పలు ప్రాంతాల్లో తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: