తెలంగాణలోకి ప్రవేశించిన మిడతల దండు... ప్రమాదంలో ఆ జిల్లా...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించింది. అధికారులు రాష్ట్రంలోని పంటలపై ఏ క్షణమైనా మిడతలు వాలిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మహారాష్ట్ర మీదుగా రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించింది. రాష్ట్రంలోని కొమరం భీం జిల్లాలోని సిర్పూర్, తిర్యాని ప్రాంతాల్లోకి మిడతల దండు ప్రవేశించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే వరికోతలు పూర్తి కావడంతో భారీ ముప్పు తప్పినట్లేనని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే దాదాపు 25,000 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలు, 10,000 ఎకరాల్లో ఉన్న కూరగాయల తోటలకు మాత్రం మిడతల దండు వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోకి మిడతల దండు ఎంటర్ కావడంతో అదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో మిడతలు కనిపించాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తిర్యాణి అడవుల్లో తిష్ట వేసిన మిడతలు ఏ క్షణమైనా పంటలపై దాడి చేయవచ్చని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: