ఏపీలో తీవ్ర విషాదం... సీనియర్ ఐఏఎస్ రమామణి కన్నుమూత..!
ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారణి టీకే రమామణి నిన్న గుంటూరులో తుదిశ్వాస విడిచారు. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను గుంటూరులోని సర్వజన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. వాణిజ్య పన్నుల శాఖలో కార్యదర్శిగా పని చేసిన రమామణి అనంతపురం జాయింట్ కలెక్టర్ గా పని చేసి ఇటీవల విజయవాడకు బదిలీ అయ్యారు.
రమామణి కర్నూలు జిల్లా నంద్య అల పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి టీకేఆర్ శర్మ స్వాతంత్ర్య సమరయోధులు. రమామణి భర్త మురళీమోహన్ ఏపీ స్టెప్‌లో మేనేజరుగా పనిచేసి రిటైర్ అయ్యారు. రమామణి హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేసే సమయంలో డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ప్రభుత్వ్, అసైన్డ్ ల్యాండ్స్ పరిరక్షణ విషయంలో ఆమెకు మంచిపేరు వచ్చింది. గుంటూరు జిల్లా జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ప్రశాంతి, ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ లు శ్రీకాంత్, తాత మోహన్ రావు, డీయస్ఓ టి.శివరామకృష్ణలు రమామణికి నివాళులు అర్పించారు.