ఏడుపు పాటల తెలంగాణ‌... పంట‌ల తెలంగాణ ఎట్టైందో చెప్పిన కేసీఆర్‌..!

Reddy P Rajasekhar

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఎంతో మంది త్యాగాలు చేశారని సీఎం అన్నారు. ఒకప్పుడు ఏడుపు పాటల తెలంగాణ ప్రాజెక్టుల వల్ల నేడు పసిడి పంటల తెలంగాణ అయిందని అన్నారు. బంగారు తెలంగాణ ఆరేళ్లలోపే సాధ్యమైందని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం కల సంపూర్ణంగా నెరవేరిందని తెలిపారు. 
 
తెలంగాణ ప్రజలకు ఇది అపూపూర ఘట్టం అని అన్నారు. భూములు ఇచ్చిన వారి త్యాగాలు మరవలేనివి అని చెప్పారు. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతామని దేశం ఆశ్చర్యపోయే విషయం చెబుతామని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావునోట్లో తలపెట్టానని సీఎం అన్నారు. వేలాది గ్రామాలు ముఖ్యమంత్రి మాటే మా బాట అంటున్నాయని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: