తిరుమలలో రోజుకు 7,000 మందికి మాత్రమే అనుమతి..... టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే...?
ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకు 7,000 మందికి మాత్రమే టీటీడీ అనుమతులు ఇవ్వనుంది. భక్తుల కోసం టీటీడీ ఆన్ లైన్ లో 3,000 టికెట్లు అందుబాటులో ఉంచనుంది. మిగిలిన 4,000 టికెట్లలో అధిక భాగం టికెట్లను గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. టీటీడీ కౌంటర్లలో తక్కువ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ నెల 11 నుంచి శ్రీవారి సర్వదర్శనానికి టీటీడీ అనుమతులు ఇచ్చింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. టీటీడీ భక్తులకు మాస్క్ తప్పనిసరి చేసింది. ఆన్ లైన్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకునే వారికి రూమ్స్ కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. బస్సులతో పాటు భక్తుల లగేజీని కూడా శానిటైజ్ చేస్తామని తెలిపారు.