7 సెంట్ల స్థలమే బెజవాడ గ్యాంగ్ వార్ కు కారణం : సీపీ ద్వారకా తిరుమలరావు

Reddy P Rajasekhar

విజయవాడ గ్యాంగ్ వార్ ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదం గురించి స్పష్టతనిచ్చారు. తోట సందీప్, పండు ఒకప్పుడు స్నేహితులని... ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్టుమెంట్ వివాదం తలెత్తడంతో సమస్య పరిష్కారం కోసం నాగబాబు ద్వారా సందీప్ సందీప్, పండు ఈ వివాదంలో భాగం అయ్యారని చెప్పారు. 
 
మొదట చర్చల కోసం భేటీ అయ్యారని... అనంతరం ఘర్షణ మొదలవడంతో గ్యాంగ్ వార్ జరిగిందని... పోలీసులు ఘటనా స్థలానికి చేరే సరికి గొడవ పూర్తైందని చెప్పారు. 7 సెంట్ల స్థలం వల్ల వివాదం ప్రారంభమైందని..... కర్రలు, రాళ్లు, కత్తులు, బ్లేడులతో దాడి చేసుకున్నారని... వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మొదట సందీప్, పండు స్నేహితులని కాలక్రమంలో విభేదాలు వచ్చాయని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: