కరోనా టెస్ట్ ఇప్పుడు ఇంట్లోనే... పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి కీలక నిర్ణయం..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరిలో కరోనా వైరస్ భయం కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సాధ్యమైనంత మేరకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వైద్యం. అయితే కొంతమంది మాత్రం ప్రైవేట్ ల్యాబ్ లలో కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పేద ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, ఈ క్రమంలో పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ ప్రయోగశాలల్లో రోజుకు 9 వేల కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అంటూ ఆయన తెలిపారు. అయితే ఇంట్లో ఉంటూనే పిపిఎల్ ప్రైవేట్ ల్యాబ్లను సంప్రదించగల పథకాన్ని ప్రారంభించామని పంజాబ్ హెల్త్ మినిస్టర్ తెలిపారు. ఇలా ఇంటి వద్దకే ప్రైవేట్ పిపిఎల్ కిట్లు వచ్చేందుకు సేవా చార్జీగా 1000 రూపాయలు వసూలు చేస్తారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. వాళ్లు మా లాబ్లో మాదిరిగా పరీక్షలు ఉచితంగా చేస్తారు అంటూ పంజాబ్ హెల్త్ మినిస్టర్ బి ఎస్ సిద్దు తెలిపారు.
Govt labs have capacity of 9000 tests per day. We've launched a scheme under which ppl can contact private labs for sampling at home for which they'll charge Rs 1000 as service charge. They'll do sampling&test will be done for free in our labs: punjab health Min BS Sidhu #COVID19 pic.twitter.com/aVV2s5LDwp — ANI (@ANI) June 5, 2020