పర్యావరణం పై ఉపాసన ఆసక్తికర ట్విట్...?
కొణిదెల వారి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎప్పుడూ సామాజిక విషయాలపై స్పందిస్తూ ఎంతోమందికి పలు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ప్రతి విషయంలో ఎంతో ధైర్యంగా ఉంటూ ఉపాసన మహిళలకు ధైర్యసాహసాలతో ఎలా ఉండాలి అనే దానిపై ఎప్పుడు చెబుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసన తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్లను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇక ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపాసన ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టారు... నేను సంతోషంగా ఉన్నాను అంటే... నాకు ఇప్పటికీ ఒక హోప్ ఉంది... నేను పాజిటివ్ గానే ఉన్నాను.. మనమందరం పర్యావరణాన్ని రక్షించడానికి సిద్ధం కావాలి అంటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఒక ట్విట్ పెట్టగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.