బెజవాడ దుర్గమ్మ భక్తులకు షాకింగ్ న్యూస్... దర్శనానికి భక్తులకు బ్రేక్...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల ప్రకారం ప్రభుత్వం ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తెరచుకోవడానికి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 8వ తేదీ నుంచి తిరుపతి, శ్రీశైలం, ఇతర ఆలయాలలో భక్తులకు దర్శనాలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమలలో 8, 9,10 తేదీలలో ట్రయల్స్ నిర్వహించాలని... 11వ తేదీ నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 
 
అయితే బెజవాడ దుర్గమ్మ దర్శనం మాత్రం ఇప్పట్లో ఉండదని సమాచారం అందుతోంది. కొండ దిగువన పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆలయానికి భక్తులను అనుమతించే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: