ఫేస్బుక్ లో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..?
తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత మంది స్టార్ హీరోలు ఉన్న ఆయన కున్న క్రేజ్ మాత్రం ఎంతో ప్రత్యేకం. అటు సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటు అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఇక మొన్నటికి మొన్న అలా వైకుంఠపురములో సినిమాలో ఏకంగా సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఇక తాజాగా అల్లు అర్జున్ మరో రికార్డు సాధించారు. ఫేస్బుక్లో 13 మిలియన్ లైక్స్ వచ్చినా నటుడిగా రికార్డు సృష్టించాడు అల్లు అర్జున్. దక్షిణభారతదేశపు చిత్ర పరిశ్రమలో ఏ నటుడికి కూడా ఇప్పటివరకు 13 మిలియన్ లైక్స్ పొందలేదు. మొదటిసారి అల్లు అర్జున్ 13 మిలియన్ లైక్స్ పొంది రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.