ప్రజలకు షాకింగ్ న్యూస్.... జులైలో మరోసారి మిడతల దాడి...?
ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ కొన్నిరోజుల క్రితం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను కలవరపెట్టిన మిడతల దండు మరోసారి దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మిడతల దండు వల్ల ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలలో రైతులు పంటలు నష్టపోయారు. ఇప్పటికీ రాజస్తాన్, మధ్యప్రదేశ్ లోని పలు గ్రామాల్లో మిడతల దాడి కొనసాగుతోందని తెలుస్తోంది.
ఆహార, వ్యవసాయ సంస్థ జులైలో భారత్ పై మరోసారి మిడతల దండు దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. కెన్యా, సొమాలియా, ఇథియోపియా దేశాల్లో గుడ్డు దశలో ఉన్న మిడతలు ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా భారత్ - పాక్ దేశాలకు చేరుకునే అవకాశం ఉందని మిడతల దండు రోజులో 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని ఆహార, వ్యవసాయ సంస్థ పేర్కొంది. ఈ మిడతల గుంపు ఒకరోజులో 35,000 మందికి సరిపడా ఆహారాన్ని తినేస్తాయని తెలుస్తోంది.