ప్రాజెక్టుల కోసం 55 వేల చెట్లు నేలమట్టం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం... సర్వత్రా విమర్శలు...?

Reddy P Rajasekhar

దేశంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతున్నాయి. దేశంలో వాహనాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవడం అదే సమయంలో చెట్లను నరికివేస్తూ ఉండటం, చెట్ల పెంపకం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
గోవా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టే మూడు కీలక ప్రాజెక్టుల కొరకు 55 వేల చెట్లను నేలమట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. అటవీ, పర్యావరణ శాఖ ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ విషయం తెలిసి పర్యావరణ ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో చెట్లను నేలమట్టం చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గోవా సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు లేఖ రాశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: