కేసీఆర్ చెబితే జగన్ వింటారు... పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

నటుడు పోసాని కృష్ణమురళి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాఅరు. పోసాని మాట్లాడుతూ తెలంగాణకు కేసీఆర్, కేటీఆర్ రెండు కళ్లు అని అన్నారు. మంత్రి, కేటీఆర్, హరీష్ రావులు నిజాయతీపరులు అని చెప్పారు. కేటీఆర్ పై ఆరోపణలు చేసి రాజీనామా చేయమనడమేంటని ప్రశ్నించారు. 50 లక్షల రూపాయలతో పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శలు చేశారు. కేటీఆర్ అవినీతి చేశాడని నిరూపిస్తే టీ.ఆర్.ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తానని అన్నారు. 
 
నీళ్ల దోపిడీపై గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు వాస్తవం అని అన్నారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ సమర్థవంతమైన నాయకులంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెబితే జగన్ ఖచ్చితంగా వింటాడని పోసాని అన్నారు. బాలకృష్ణ మాటలు సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బాలయ్య కోపం, ఆవేశం వల్ల సమాజానికి నష్టం కలగదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: