శ్రీవారి దర్శనం ప్రారంభం... భక్తులకు టీటీడీ భారీ షాక్...?
దాదాపు 80 రోజుల తరువాత తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తెరచుకోనుంది. 300 రూపాయల దర్శన టికెట్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. మూడు రోజుల పాటు స్థానికులు, ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. టీటీడీ 11వ తేదీ నుంచి సాధారణ భక్తులకు సర్వ దర్శనం కల్పించనుంది. రోజుకు 7,000 మంది భక్తులను టీటీడీ అనుమతించనుంది. అయితే మార్చి 20వ తేదీ తరువాత ఈరోజు శ్రీవారి ఆలయం తెరచుకుంది.
అయితే టీటీడీ భక్తులకు ఊహించని షాక్ ఇచ్చింది. టీటీడీ అలిపిరి టోల్ గేట్ ధరలను భారీగా పెంచింది. గతంలో లైట్ మోటార్ వాహనాలకు 15 రూపాయలుగా ఉన్న టోల్ ఫీజును 50 రూపాయలకు, మినీ వాహనాలకు గతంలో 60 రూపాయలుగా ఉన్న టోల్ ఫీజును 100 రూపాయలకు, బస్సులు... లారీలు... భారీ వాహనాలకు గతంలో 100 రూపాయలుగా ఉన్న టోల్ ఫీజును 200 రూపాయలకు పెంచుతున్నట్టు టీటీడీ పేర్కొంది.