కడప మున్సిపల్ గ్రౌండ్ లో ఉద్రిక్తత.. వ్యక్తి మృతి...?

Reddy P Rajasekhar

కడప జిల్లాలో ఉల్లిపాయల అమ్మకంలో మొదలైన గొడవ ఒక వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. ఉల్లిపాయలు తక్కువ రేటుకు అమ్ముతుండటంతో సత్తార్, ఇయాజ్ అనే ఇద్దరు వ్యాపారుల మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో సత్తార్ ఇయాజ్ పై దాడి చేయడంతో ఇయాజ్ సంఘటనా స్థలంలో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ఇయాజ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇయాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీస్ అధికారి మాట్లాడుతూ ఇయాజ్, సత్తార్ మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు ఉన్నాయని... ఇయాజ్ తక్కువ రేటుకు హోల్ సేల్ గా ఉల్లిపాయలు అమ్మడంతో వివాదం మొదలైందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: