రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.... రాష్ట్ర సరిహద్దులు మూసివేత...?
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర సరిహద్దులను వారం రోజుల పాటు మూసివేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్,మధ్యప్రదేశ్, యూపీ,హర్యానా రాష్ట్రాల సరిహద్దులను రాజస్థాన్ మూసివేసింది. . అత్యవసర సేవలు ,పాసులు ఉన్నవారికి మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని కీలక ప్రకటన చేసింది.
గత 24 గంటల్లో 123 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న నమోదైన కేసులతో 11368కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 256కు చేరింది. ఢిల్లీతో పాటు హర్యానా కూడా తమ రాష్ట్ర సరిహద్దులను చెరిపివేసింది. ఇప్పటికే ఢిల్లీతో పాటు హర్యానా కూడా రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది.