నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త... 5,701 పోస్టుల భర్తీకి అనుమతి...?
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్ ప్రధానంగా యువతకు ఉద్యోగాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు... 1,26,728 గ్రామ, సచివాలయ ఉద్యోగాలను ఏడాది కాలంలో భర్తీ చేశారు. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి జనవరి నెలలో నోటిఫికేషన్ విడుదల కాగా జులైలో పరీక్షలు జరగనున్నాయి. సీఎం జగన్ తాజాగా మరో 5,701 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చారు.
నిన్న ఏపీ ప్రభుత్వం నుంచి వైద్య, ఆరోగ్య శాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ వైద్యుల నియామకం, ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. ప్రభుత్వం స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషిన్ల ఖాళీలలో 2,186 మందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించనుంది. వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విదాన పరిషత్తులో 1,021 పోస్టులను, ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సర్జన్, డెంటల్ సర్జన్లకు సంబంధించిన 804 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.