ముగిసిన ఏపీ కేబినేట్ భేటీ.... కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్...?

Reddy P Rajasekhar

ఏపీ కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏపీ కేబినెట్ భేటీలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం ఎయిర్ పోర్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు దశల్లో రామాయపట్నం నిర్మాణం పూర్తి కానుంది. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యూడీషియల్ కమిటీకి పంపాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 
 
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతకలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందజేసింది. వైయస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకల గురించి జగన్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆగష్టు 12 న వైయస్సార్ చేయూత పథకం అమలు కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: